న్యూఢిల్లీ: అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటైన ‘ఒరాకిల్’ భారతీయ టెక్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. భారత్లోని ఈ సంస్థకు చెందిన కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. గత వారం రోజుల్లో దాదాపు 100మందికిపైగా భారతీయ ఉద్యోగులను ఒరాకిల్ ఇంటికి పంపినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
క్లౌడ్ కంప్యూటింగ్ సహా వివిధ బృందాల్లో వందల మందిని తొలగించినట్టు ఉద్యోగంలో కొనసాగుతున్న వారి స్థానాలకు కూడా గ్యారెంటీ లేదని, కృత్రిమ మేధ వినియోగం, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగాల కోతను కంపెనీ చేపట్టినట్టు ఒరాకిల్ ఉద్యోగి ఒకరు చెప్పారు.