INDIA | పార్లమెంట్ శీతాకాల సమావేశాలను అదానీ అంశం, యూపీలోని సంభల్ హింసాకాండ ఘటనలు కుదిపేస్తున్నాయి. ఈ అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుపడుతుండటంతో ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన ఎంపీలు సమావేశమయ్యారు (INDIA bloc leaders). అయితే, ఈ కీ మీటింగ్‌ను కూటమిలో భాగంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) దాటవేసింది.
సోమవారం పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన అనంతరం.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఎంపీలంతా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఉభయసభల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎదుర్కొనే వ్యూహంపై తీవ్రంగా చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే, ఈ కీ మీటింగ్‌కు తృణమూల్ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ అంశం సహా ఆరు కీలక అంశాలను మాత్రమే పార్లమెంట్లో లేవనెత్తాలనుకుంటున్నట్లు ఆ పార్టీ (తృణమూల్) వర్గాలు తెలిపాయి. కానీ కాంగ్రెస్ మాత్రం అదానీ వ్యవహారంపై మాత్రమే ఒత్తిడి చేయాలనుకుంటోందని.. దీంతో నేడు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశానికి హాజరుకావడం లేదని ఆ పార్టీ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. తమ ప్రధాన అంశాలు ఎజెండాలో లేనప్పుడు సమావేశానికి హాజరు కాబోమని తృణమూల్ నేతలు స్పష్టంగా తెలి పినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
Also Read..
IPS Officer | డ్యూటీలో చేరేందుకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన యువ ఐపీఎస్ అధికారి
Farmers March | రైతుల ఆందోళన.. ఢిల్లీ – నోయిడా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్
Sabarmati Report | పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ది సబర్మతి రిపోర్ట్ స్క్రీనింగ్.. వీక్షించనున్న మోదీ