Karnataka | ‘లోక్సభ’లో గెలిస్తేనే కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ఐదేండ్లు: యతీంద్ర
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ‘సీఎం మార్పు’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం సిద్ధరామయ్య కుమారుడు, మాజీ ఎమ్మెల్యే యతీంద్ర చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
- అప్పుడే సీఎంగా సిద్ధరామయ్య ఐదేండ్లు కొనసాగుతారు: యతీంద్ర
Karnataka | బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ‘సీఎం మార్పు’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం సిద్ధరామయ్య కుమారుడు, మాజీ ఎమ్మెల్యే యతీంద్ర చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హసన్లో బుధవారం యతీంద్ర మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవడం ద్వారా తన తండ్రి సిద్ధరామయ్య ఎలాంటి ‘అడ్డంకులు’ లేకుండా ఐదేండ్ల పాటు సీఎంగా కొనసాగుతారని, గ్యారెంటీ పథకాలు అమలవుతాయని అన్నారు.
సీఎం సిద్ధరామయ్య పదవీకాలంపై యతీంద్ర చేసిన వ్యాఖ్యలను వక్రీకరించాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. అటు యతీంద్ర వ్యాఖ్యలపై బీజేపీ నేత అశోక మాట్లాడుతూ సీఎంగా సిద్ధరామయ్యకు రోజుల లెక్కింపు ప్రారంభమైందనేది ఇక రహస్యంగా ఉండబోదని అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆయనకు ఆ పార్టీ హైకమాండ్ ‘ఎగ్జిట్ డోర్’ చూపిస్తుందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

