గ్లాస్గో: నాలుగేండ్లకోసారి వచ్చే మల్టీ స్పోర్టింగ్ ఈవెంట్ కామన్వెల్త్ గేమ్స్ సందడి మొదలైంది. గ్లాస్గో ఆతిథ్యం ఇస్తున్న 13వ ఎడిషన్ ప్రారంభోత్సవాన్ని గురువారం అర్ధరాత్రి ఇక్కడి ఒవో హైడ్రో స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించారు. లవ్ లెటర్ టు గ్లాస్గో (గ్లాస్గోకు ప్రేమలేఖ) అనే ప్రత్యేక థీమ్‌తో రూపొందించిన ఈ వేడుకను కామన్వెల్త్ చరిత్రలోనే తొలిసారిగా ఇండోర్ అరీనాలో నిర్వహించారు.
బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి తీసుకొచ్చిన కింగ్స్ బ్యాటన్ సందేశాన్ని చదివి బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 గేమ్స్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆతిథ్య స్కాట్లాండ్ సంస్కృతిని, కామన్వెల్త్ దేశాల ఆత్మీయతను ప్రతిబింబించేలా కేటీ టన్ స్టాల్, నాథన్ ఈవాన్స్, కాలమ్ బిటీ, నీనా నెస్బిట్ వంటి ప్రముఖ సంగీత కళాకారుల ప్రదర్శనలు అలరించాయి.
కామన్వెల్త్ కూటమికి చెందిన 74 దేశాల అథ్లెట్లతో నిర్వహించిన పరేడ్ ఈ వేడుకకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మార్చ్ఫాస్ట్లో వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను త్రివర్ణ పతాకాన్ని, బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ కింగ్స్ బ్యాటన్‌ను చేతబూని భారత జట్టును ముందుండి నడిపించారు.
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. రింగ్‌లోకి దిగకముందే భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ పతకం ఖాయం చేసుకుంది. మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనాకు తొలి రౌండ్లో బై లభించింది. దాంతో తను నేరుగా ఈ నెల 31న జరిగే సెమీఫైనల్లో పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఆమెకు కనీసం కాంస్యం లభించనుంది. కాగా, ఒలింపిక్ మెడలిస్ట్ అయిన లవ్లీనాకు కామన్వెల్త్లో ఇదే మొదటి పతకం కావడం విశేషం.
గేమ్స్ తొలి రోజు జరిగిన లాన్ బౌల్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. పురుషుల సింగిల్స్ సెక్షన్ -డి తొలి మ్యాచ్‌లో పుతుల్ సొనోవాల్.. 2023 వరల్డ్ చాంపియన్ ర్యాన్ బెస్టర్ (కెనడా)పై టై బ్రేక్‌లో విజయం సాధించి శుభారంభం చేశాడు. విమెన్స్ పెయిర్ ఈవెంట్ సెక్షన్-బి తొలి మ్యాచ్‌లోభారత ద్వయం రూపా రాణి-పింకి సింగ్ ద్వయం మాల్టా దేశానికి చెందిన ప్రత్యర్థులపై టై బ్రేక్‌లో గెలుపొందింది.
మెగా గేమ్స్‌లో ప్రారంభోత్సవానికి ముందే భారత బృందంలో డోపింగ్ కలకలం రేగింది. జుడోకా అరుణ్ కుమార్ ఔట్ ఆఫ్ కాంపిటీషన్ డోప్ టెస్టులో విఫలమయ్యాడు. దాంతో 14 మందితో కూడిన భారత కామన్వెల్త్ బృందం నుంచి అతడిని తప్పించారు. వెయిట్ లిఫ్టర్ దిల్బాగ్ సింగ్‌ను గేమ్స్ నుంచి భారత్ విత్‌డ్రా చేసుకుంది. కామన్వెల్త్ క్వాలిఫికేషన్ టైమ్‌లో భారత లిఫ్టర్లు యాంటీ డోపింగ్ రూల్స్‌ను ఉల్లంఘించిన నేపథ్యంలో వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒక కోటాను తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.