Karnataka | బెంగళూరు, జనవరి 22: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకలో తదుపరి సీఎం ఎవరన్న రచ్చ కొనసాగుతూనే ఉంది. ఒక పక్క ఆ ఆంశంపై ఎవరూ మాట్లాడరాదంటూ అధిష్ఠానం గట్టిగా ఆదేశాలు జారీ చేసినా నేతలెవరూ పట్టించుకోవడం లేదు.
తాజాగా తమ నేత, పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళి తదుపరి ముఖ్యమంత్రి కావాలంటూ బాగెవాడికి చెందిన కాంగ్రెస్ నేత పరశురామ్ ఆధ్వర్యంలో బలప్రదర్శన జరిగింది. ఆయన తన అనుచరులతో కలిసి బుధవారం బెళగావిలోని సిగందూర్ చోడేశ్వరి దేవి ఆలయంలో పూజ చేశారు. ఈ సందర్భంగా కాబోయే ముఖ్యమంత్రి జార్కిహోళి అంటూ పెద్దయెత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు.