Dark Chocolate | న్యూఢిల్లీ : రుచికరమైన చాకొలెట్లను తినాలంటే భయపడేవారికి తాజా అధ్యయనం శుభవార్త చెప్పింది. మిల్క్ చాకొలెట్ల కన్నా డార్క్ చాకొలెట్లను తినడం వల్ల టైప్-2 మధుమేహం ముప్పు 21 శాతం వరకు తగ్గుతుందని వెల్లడించింది. హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.
అసోసియేట్ ప్రొఫెసర్ కీ సున్ మాట్లాడుతూ, డార్క్, మిల్క్ చాకొలెట్లలో ఒకే స్థాయిలో శాచ్యురేటెడ్ ఫ్యాట్, క్యాలరీలు ఉంటాయన్నారు. అయితే బరువు పెరగడం, మధుమేహంపై సంతృప్త కొవ్వు, సుగర్ చూపే ప్రభావాన్ని డార్క్ చాకొలెట్లలోని పాలిఫెనోల్స్ తగ్గించే అవకాశం ఉన్నట్లు కనిపించిందన్నారు. ఇది అత్య ంత సంక్లిష్టమైన వ్యత్యాసమని అన్నారు.