రాయ్‌పూర్ : ఛత్తీస్‌గడ్‌లోని ముస్తల్నార్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 7:30 గంటలకు ఎదురుకాల్పులు జరిగాయి. దంతెవాడ డీఆర్జీ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు సంభవించినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. ఈ ఎదురుకాల్పుల్లో 20 ఏండ్ల వయసున్న ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఘటనాస్థలి నుంచి 2 కిలోల ఐఈడీ, 2 నాటు తుపాకులు, 4 పిస్తోళ్లతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఏరియాలో బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.
Chhattisgarh | In exchange of fire at Mustalnar, Police Station Geedam between maoists & Dantewada DRG at 7:30 am, a body of a 20-year maoist has been recovered. 2 country-made weapons, 2 kg IED, wires, 4 pithoos & other items also recovered: Dantewada SP Abhishek Pallav
— ANI (@ANI) May 14, 2021