కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ అధికారిక నివాసంలో బీజేపీకి చెందిన నేరస్తులు ఆశ్రయం పొందుతున్నారని, లోపల ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేశారని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ సీవీ ఆనంద బోస్ భద్రతా దళాలతో రాజ్‌భవన్‌ను తనిఖీ చేయించారు. సోమవారం ఉత్తర జిల్లా పర్యటనను మధ్యలోనే ఆయన ముగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు, కేంద్ర భద్రతా దళాలతో కలిసి రాజ్‌భవన్ లోపల సోదా చేయించారు.
కాగా, తనిఖీల అనంతరం గవర్నర్ సీవీ ఆనంద బోస్ మీడియాతో మాట్లాడారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపణల నేపథ్యంలో బాంబు స్క్వాడ్లు, స్నిఫర్ డాగ్‌లతో రాజ్‌భవన్‌లో సోదాలు చేయించినట్లు తెలిపారు. అయితే భద్రతా దళాలు ఏమీ కనుగొనలేదని అన్నారు. దీంతో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తప్పుడు ఆరోపణలు చేసినట్లు రుజువైందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై గవర్నర్ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే గవర్నర్ ఉత్తర్వులను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులకు కూడా సీవీ ఆనంద బోస్ కార్యాలయం వార్నింగ్ ఇచ్చింది.
🎥 | West Bengal Governor C.V. Ananda Bose led a live-streamed combing operation at Raj Bhavan in Kolkata. This comes following TMC MP Kalyan Banerjee’s allegation that the Governor had stashed guns and bombs at Raj Bhavan and was sheltering “BJP criminals.” Police, #CRPF, bomb… pic.twitter.com/KbaDfQeJfL
— The Statesman (@TheStatesmanLtd) November 17, 2025
Also Read:
Watch: కొత్తగా కొనుగోలు చేసిన థార్‌లో సమస్యలు.. షోరూమ్‌కు లాక్కెళ్లిన గాడిదలు