Nirmala Sitharaman | లోన్ రికవరీ ప్రక్రియలో బ్యాంకులకు ఆర్ధిక మంత్రి కీలక సూచన
రుణాలను వసూలు చేసే క్రమంలో పరుషంగా వ్యవహరించరాదని, ఈ తరహా కేసులను సున్నితంగా, మానవత్వంతో డీల్ చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సూచించారు.
న్యూఢిల్లీ : రుణాలను వసూలు చేసే క్రమంలో పరుషంగా వ్యవహరించరాదని, ఈ తరహా కేసులను సున్నితంగా, మానవత్వంతో డీల్ చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సూచించారు. చిరు వ్యాపారులు, రుణ గ్రహీతల రుణ చెల్లింపు ప్రక్రియకు సంబంధించి ప్రశ్నోత్నరాల కార్యక్రమంలో సోమవారం మంత్రి సీతారామన్ జోక్యం చేసుకుని కొన్ని బ్యాంకులు రుణాల రీపేమెంట్స్ విషయంలో పరుషంగా వ్యవహరిస్తున్న తీరు తన దృష్టికి వచ్చిందని చెప్పారు.
ఈ విషయంలో బ్యాంకులు పరుషంగా వ్యవహరించరాదని మానవత్వంతో సున్నితంగా ఈ కేసులను డీల్ చేయాలని బ్యాంకులకు ప్రభుత్వం సూచిస్తోందని తెలిపారు. చెల్లించాల్సిన రుణ మొత్తాన్ని బ్యాంకులు రికవరీ చేయాలనుకుంటే చట్టంలో పొందుపరిచిన విధానం ప్రకారం రికవరీ చేయాలని మద్రాస్ హైకోర్ట్ గతవారం స్పష్టం చేసింది.
బ్యాంకులు నియమించిన ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా దౌర్జన్యంగా రికవరీ ప్రక్రియ చేపడితే దాన్ని అనుమతించబోమని కోర్టు తేల్చిచెప్పింది. రుణ మొత్తాన్ని రాబట్టేందుకు బ్యాంకులు అంగబలం ప్రదర్శించరాదని పేర్కొంది. రికవరీ ఏజెంట్స్పై ఫిర్యాదులు వస్తే ఏజెంట్ల నియామకం చేపట్టకుండా బ్యాంకులపై తాము నిషేధం విధిస్తామని ఆర్బీఐ 2008లో జారీ చేసిన సర్క్యులర్లో బ్యాంకులను హెచ్చరించింది.
Read More :
Drone Attack: మాస్కో నగరంపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

