చండీగఢ్: పొరుగింటికి చెందిన వ్యక్తి బీజేపీ నేతను కాల్చి చంపాడు. (BJP Leader Shot Dead) ఆయనను వెంబడించగా ఒక షాపులోకి వెళ్లాడు. అక్కడ గన్‌తో కాల్పులు జరిపి బీజేపీ నేతను హత్య చేశాడు. ఈ హత్యకు భూవివాదం కారణమని పోలీసులు తెలిపారు. బీజేపీ పాలిత హర్యానాలో ఈ సంఘటన జరిగింది. సోనిపట్‌కు చెందిన బీజేపీ నేత సురేంద్ర జవహర్, పొరుగింటికి చెందిన మోను బంధువుల నుంచి భూమిని కొనుగోలు చేశాడు. నాటి నుంచి భూమి విషయంలో వారిద్దరి మధ్య వివాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఆ భూమిలోకి అడుగుపెట్టవద్దని సురేంద్రను మోను హెచ్చరించాడు.
కాగా, భూ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు బీజేపీ నేత సురేంద్ర జవహర్ ప్రయత్నించాడు. శుక్రవారం రాత్రి ఆ భూమి వద్దకు ఆయన వెళ్లాడు. అయితే మోను దీనిపై ఆగ్రహించాడు. సురేంద్రపై గన్ ఎక్కుపెట్టాడు. దీంతో ఆయన భయంతో అక్కడున్న ఒక షాపులోకి పరుగులు తీశాడు.
మరోవైపు సురేంద్రను మోను వెంబడించాడు. షాపులోకి ప్రవేశించిన అతడ్ని అడ్డుకునేందుకు అక్కడున్న ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు. అయినప్పటికీ చేతిలోని గన్‌తో సురేంద్ర తలపై మోను కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సురేంద్ర జవహర్ మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయనను హత్య చేసిన నిందితుడు మోనును శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు షాపులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A local #BJP leader was shot dead in #Haryana‘s #Sonipat district allegedly over a land dispute, police said on Saturday.
The deceased has been identified as #SurendraJawahar, president of BJP’s #Mundlana Mandal in Sonipat, officials said.
The unknown assailant allegedly opened… pic.twitter.com/Zzm6flnhEX
— Hate Detector 🔍 (@HateDetectors) March 15, 2025