BJP Leader | బీజేపీ నాయకుడి దారుణ హత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన ప్రత్యర్థులు
BJP Leader | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని సంభాల్ ( Sambhal) కు చెందిన బీజేపీ నాయకుడు (BJP Leader) దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు.
BJP Leader | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని సంభాల్ ( Sambhal) కు చెందిన బీజేపీ నాయకుడు (BJP Leader) దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఘనటకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అనుజ్ చౌదరి ( Anuj Chaudhary) (34) గురువారం సాయంత్రం సమయంలో మొరదాబాద్ (Moradabad)లోని తన అపార్ట్మెంట్ వద్ద ఓ వ్యక్తితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు చౌదరిపై కాల్పులు జరిపారు. దీంతో అతను కిందపడిపోయాడు. ఈ ఘటనలో చౌదరితో కలిసి నడుస్తున్న వ్యక్తి అక్కడి నుంచి భయంతో పరుగున వెళ్లిపోయాడు. అనంతరం ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు బైక్ దిగి చౌదరిపై వరుసగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతన్న అనుజ్ చౌదరిని స్థానికులు వెంటనే మొరదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతనకు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు (Police) వెల్లడించారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు అమిత్ చౌదరి, అనికేత్‌లు అనుజ్ చౌదరి కుటుంబ సభ్యులే అని అనుమానిస్తున్నారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కాగా, రాజకీయ ప్రత్యర్థులే హత్యకు పాల్పడినట్లు చౌదరి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/UpendrraRai/status/1689869989778784256?s=20
Also Read..
Virat Kohli | ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ ఒక్కో పోస్ట్‌కు ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా..?
Russia | జాబిల్లిపైకి విజయవంతంగా దూసుకెళ్లిన రష్యా లునా-25.. చంద్రయాన్-3 కంటే ముందే ల్యాండింగ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

