Rhino | అస్సాంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మోరిగావ్ జిల్లాలోని పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఓ బైకర్పై ఖడ్గమృగం (Rhino) దాడి చేసింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అధికారిక సమాచారం మేరకు కమ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాకు చెందిన 37 ఏళ్ల సద్దాం హుస్సేన్ అనే వ్యక్తి ఆదివారం తన బైక్‌పై అభయారణ్యం మీదుగా వెళ్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ ఒంటి కొమ్ము ఖడ్గమృగం బైకర్‌ను వెంబడించింది. అనంతరం అతడిపై దాడి చేసింది. ఈ దాడిలో హుస్సేన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘వన్యప్రాణుల అభయారణ్యం నుంచి ఖడ్గమృగం బయటకు వచ్చింది. ఈ సంఘటనపై మేము దర్యాప్తు చేస్తున్నాము’ అని తెలిపారు. కాగా, ఖడ్గమృగాలు ఇలా స్థానికులపై దాడి చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. పార్కులో సఫారీకి వెళ్లిన పర్యాటకుల జీపులపై కూడా పలుమార్లు దాడి చేసేందుకు యత్నించాయి. వాటిని కిలోమీటర్ల మేర వెంబడించి భయాందోళనలు సృష్టించాయి.
ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ప్రపంచంలోనే అత్యధికంగా అస్సాంలోనే ఉన్నాయి. ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా ఈ నెలలో విడుదల చేసిన డేటా ప్రకారం.. భారత్‌లో ఒక కొమ్ము గల ఆసియా ఖడ్గమృగాల జనాభా గత నాలుగు దశాబ్దాల్లో దాదాపు మూడు రెట్లు పెరిగింది. నాలుగు దశాబ్దాల క్రితం 1,500గా ఉన్న జంతువుల సంఖ్య ఇప్పుడు 4 వేలకు పెరిగింది. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో ప్రపంచంలోని ఒక కొమ్ము ఖడ్గమృగాల్లో 80 శాతం ఉన్నట్లు అంచనా. అంతరించిపోతున్న ఈ ఖడ్గమృగాల పరిరక్షణ కోసం అస్సాం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎన్నో రకాల జంతువులు, పక్షులు, పులులకు నెలవుగా ఉన్న నేషనల్ పార్కుకు 1985లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు లభించింది.
Also Read..
Bomb Threat | తమిళనాడులోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు