Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) సర్వసాధారణమైపోయాయి. ఇటీవలే కాలంలో పాఠశాలలు, విమానాశ్రయాలు, హోటల్స్కు వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
మదురైలోని (Madurai School) కేంద్రీయ విద్యాలయ, జీవన స్కూల్, వేలఅమ్మాల్ విద్యాలయాలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆయా విద్యాసంస్థలకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన విద్యాసంస్థల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ సాయంతో ఆయా పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాంబు బెదిరింపుల వార్తతో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.
Also Read..
Nepal Floods | నేపాల్లో కొనసాగుతున్న వరద బీభత్సం.. 200 మంది మృతి
Mithun Chakraborty | మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు