పాట్నా: బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) బుధవారం తన 78వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. పాట్నాలోని నివాసంలో 78 కిలోల భారీ లడ్డూ కేక్‌ను పొడవైన కత్తితో కట్ చేశారు. ఆయన అనుచరులు, పార్టీ నేతలు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ‘లాలూ యాదవ్ జిందాబాద్’ అని నినాదాలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా లాలూ ప్రసాద్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ ఇద్దరి మధ్య సంబంధం రాజకీయాలకు అతీతమని అన్నారు. ‘బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ జీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మా మధ్య బంధం ఎప్పుడూ రాజకీయాలకే పరిమితం కాలేదు. ఇది ఉమ్మడి విలువలు, సామాజిక న్యాయం కోసం పోరాటంలో పాతుకుపోయిన లోతైన మానవ సంబంధం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
Video | RJD chief Lalu Prasad Yadav celebrates 78th birthday at his residence in Patna by cutting a 78-kg laddu cake with a sword. Large number of party workers gathered to extend wishes. pic.twitter.com/1ZIhrQuv9g
— NDTV (@ndtv) June 11, 2025
Also Read: