జైపూర్: సచిన్ పైలట్ నుంచి తాను ఎప్పుడూ దూరం కాలేదని రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అన్నారు. తాము ఎప్పుడూ విడిపోలేదని, కలిసే ఉన్నామని స్పష్టం చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు అగ్ర నేతలు ఐదేళ్ల తర్వాత తిరిగి ఒకే వేదికను పంచుకున్నారు. తన తండ్రి దివంగత రాజేష్ పైలట్ వర్ధంతి కార్యక్రమానికి హాజరుకావాలని అశోక్ గెహ్లాట్‌ను సచిన్ పైలట్ స్వయంగా ఆహ్వానించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చొన్నారు.
కాగా, అశోక్ గెహ్లాట్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సచిన్ పైలట్ నుంచి తానెప్పుడూ దూరం కాలేదని తెలిపారు. ‘మేం ఎప్పుడు విడిపోయాం? మేం ఎల్లప్పుడూ కలిసే ఉన్నాం. ప్రేమను పంచుకుంటాం. మా మధ్య దూరం ఉందని మీడియానే అంటున్నది’ అని అన్నారు.
మరోవైపు 2020 జూలైలో నాడు సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. తనకు మద్దతుగా ఉన్న18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి క్యాంపు రాజకీయం నిర్వహించారు. దీంతో నెల రోజులపాటు సంక్షోభానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం, రాష్ట్ర పార్టీ చీఫ్ పదవి నుంచి సచిన్ పైలట్‌ను కాంగ్రెస్ అధిష్టానం తొలగించింది. ఆ తర్వాత ఈ సంక్షోభం పరిష్కారమైంది.
Also Read: