జమ్ము : జమ్ముకశ్మీర్‌కు అతిథులుగా వచ్చిన వారి ప్రాణాలను కాపాడటంలో విఫలమయ్యామని పహల్గాం ఉగ్ర దాడిపై ఆ కేంద్ర పాలిత ప్రాంత సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి మృతులకు సోమవారం జమ్ము కశ్మీర్ అసెంబ్లీ నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఉగ్ర దాడిని ఖండిస్తూ ప్రత్యేక సమావేశంలో శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘సీఎంగా పర్యాటకులను నేనిక్కడికి ఆహ్వానించాను. వారిని క్షేమంగా తిరిగి ఇండ్లకు పంపడం నా బాధ్యత. అయితే నేను ఆ పని చేయాలేకపోయాను’ అని ఆయన అన్నారు.అయితే ఈ ఉగ్ర దాడి అవకాశాన్ని ఉపయోగించుకొని తమ ప్రాంతానికి రాష్ట్ర హోదాను డిమాండ్ చేయనని చెప్పారు.