Farooq Abdullah | జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ – కాంగ్రెస్ కూటమి హవా కొనసాగిస్తోంది. 90 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు గానూ ఎన్సీ కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. 40 స్థానాలకు ఫలితం తేలింది. మరో ఎనిమిది స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. బీజేపీ కేవలం 29 స్థానాలకే పరిమితమైంది. దీంతో జమ్ము కశ్మీర్లో త్వరలో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది.
ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రి (Jammu Kashmir Chief Minister) ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఎవరన్నది నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) తాజాగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపులో కూటమి విజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. తదుపరి ముఖ్యమంత్రి తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) అని స్పష్టం చేశారు. కాగా, ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా చేసిన విషయం తెలిసిందే.
#WATCH | Srinagar, J&K | National Conference chief Farooq Abdullah says, “People have given their mandate, they have proven that they don’t accept the decision that was taken on August 5…Omar Abdullah will be the chief minister.” pic.twitter.com/qiTUaFz7zd
— ANI (@ANI) October 8, 2024
Also Read..
Akkineni Nagarjuna | నాంపల్లి కోర్టుకు నాగార్జున ఫ్యామిలీ.. ఎవరెవరు వచ్చారంటే..?
Vinesh Phogat | జులానాలో వినేష్ ఫొగాట్ విజయం
Kanguva | సూర్య కంగువకు సూపర్ క్రేజ్.. ఓవర్సీస్ పార్ట్నర్స్ వివరాలివే