Chattisgarh Reservoir | ఫోన్ కోసం రిజర్వాయర్‌లోని నీటిని తోడేసిన అధికారి.. అనుమతులిచ్చిన ఆఫీసర్‌కు భారీ జరిమానా
Chattisgarh Reservoir | రిజర్వాయర్ (Reservoir)లో పడిన ఖరీదైన తన స్మార్ట్‌ఫోన్ (Smart Phone)కోసం ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా 21 లక్షల లీటర్ల నీటిని తోడించేసిన విషయం తెలిసిందే. నీటిని తోడేందుకు అనుమతులిచ్చిన నీటి పారుదల శాఖ అధికారికి తాజాగా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నీటిని వృధా చేసినందుకు గానూ భారీగా జరిమానా విధించింది.
Chattisgarh Reservoir | రిజర్వాయర్ (Reservoir)లో పడిన ఖరీదైన తన స్మార్ట్‌ఫోన్ (Smart Phone)కోసం ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా 21 లక్షల లీటర్ల నీటిని తోడించేసిన విషయం తెలిసిందే. చత్తీస్‌గఢ్ (Chattisgarh) రాష్ట్రం కంకేర్ ( Kanker ) జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన సదరు ఫుడ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు కూడా. అయితే, నీటిని తోడేందుకు అనుమతులిచ్చిన నీటి పారుదల శాఖ అధికారికి తాజాగా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నీటిని వృధా చేసినందుకు గానూ భారీగా జరిమానా విధించింది. రూ.53 వేల మేర ఫైన్ వేసింది.
కంకేర్ ( Kanker ) జిల్లాలోని కొలిబెడా బ్లాక్‌లో ఉన్న ఖేర్‌కట్టా డ్యామ్ (Kherkatta Dam) కు తన మిత్రులతో కలిసి ఫుడ్ ఆఫీసర్ రాజేశ్ విశ్వాస్ (Rajesh Vishwas) గత ఆదివారం పిక్నిక్ వెళ్లాడు. అక్కడ డ్యామ్ వద్ద సెల్ఫీ దిగుతున్న సమయంలో తన చేతుల్లో ఉన్న ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఆ డ్యామ్‌లోని నీటిలోకి పడింది. రూ.లక్ష ఖరీదైన ఆ ఫోన్లో ప్రభుత్వ డేటా ఉండటంతో దాన్ని నీటిలో నుంచి వెలికి తీసేందుకు ముందుగా గజ ఈతగాళ్లను పంపారు. అయినా ఫోన్ జాడ దొరకలేదు. ఇదే విషయాన్ని జలవనరుల శాఖ అధికారులకు సమాచారం అందించాడు. వారి అనుమతితో రిజర్వాయర్‌లోని నీటిని తోడేందుకు చర్యలు చేపట్టాడు.
15 అడుగుల లోతైన ఆ డ్యామ్ నుంచి 30హెచ్‌పీ డీజిల్ పంపులతో వరుసగా మూడు రోజుల పాటు నీటిని తొడించేశాడు. ఆ మూడు రోజుల్లో 21 లక్షల లీటర్ల నీరు వృధాగా వెళ్లిపోయింది. ఆ నీటితో దాదాపు 1500 ఎకరాల్లో పంట పండుతుంది. అయితే అతను చేసిన ఈ ప్రయత్నంలో ఫోన్ దొరికినప్పటికీ అది పనిచేయడం లేదని తెలుస్తోంది.
Also Read..
Bangalore | బెంగళూరులో పంక్చర్ మాఫియా ఆగడాలు.. రోడ్డెక్కాలంటేనే భయపడిపోతున్న ప్రజలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

