Odisha Train Accident Live Updates | ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మూడు రైళ్లు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఒడీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రైలు బోగీల్లో చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఒడిషాలోని బాలాసోర్(Balasore) వద్ద నిన్న రాత్రి జరిగిన రైలు ప్రమాదంతో యావత్ దేశం ఉలిక్కి పడింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohl) సంతాపం తెలిపాడు. పలుకుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటనపై అతను ట్విట్టర్ వేదికగా స్పందించాడు. రైలు ప్రమాదం తనను ఎంతో బాధించిందని అతను అన్నాడు.
ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదంతో మాటలకందని విషాదం నెలకొన్నది. 280 మందికిపైగా మృతి చెందగా.. 900 మందికిపైగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రులకు తరలించగా చికిత్స పొందుతున్నారు. మరో వైపు బాధితుల కోసం రక్తదానం చేసేందుకు యువత ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. కటక్, భద్రక్, బాలాసోర్‌లోని ఆసుపత్రుల వద్దకు జనం చేరుకున్నారు. కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ వద్ద పెద్ద సంఖ్యలో యువకులు రక్తదానం చేసేందుకు తరలివచ్చారు.
లూప్లైన్లో ఆగివున్న గూడ్స్ రైలును రాంగ్ సిగ్నల్ కారణంగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వేగంగా ఢీకొట్టింది. కోరమాండల్ స్పీడ్‌కు ఆ రైలు ఇంజిన్ గూడ్స్ రైలు బోగీలపైకి ఎక్కి ఆగిపోయింది. వెనుక బోగీలు పట్టాలు తప్పి ఫల్టీలు కొట్టాయి. ఇంతలో హైరా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చి పట్టాలకు అడ్డంగా పడివున్న బోగీలను ఢీకొట్టింది. దాంతో ఆ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పి ట్రాక్ వెంబడి చెల్లాచెదురుగా పడ్డాయి.
#WATCH | Latest aerial visuals from the site of the deadly train accident in Odisha's #Balasore
As per the latest information, the death toll stands at 238 in the collision between three trains.#BalasoreTrainAccident pic.twitter.com/PusSnQ3XWw
— ANI (@ANI) June 3, 2023
ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహానగా స్టేషన్‌కు ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మోదీకి ప్రమాదం గురించి వివరించారు. చెల్లాచెదురుగా పడి ఉన్న బోగీలను మోదీ పరిశీలించారు. సహాయక చర్యలపై మోదీ ఆరా తీశారు. రైలు ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అధికారులు మోదీకి అందజేశారు.
#WATCH | Odisha: Visuals from the site of #BalasoreTrainAccident where PM Modi has reached to take stock of the tragic accident that has left 261 people dead and over 900 people injured so far.#OdishaTrainAccident pic.twitter.com/fkcASxgZu1
— ANI (@ANI) June 3, 2023
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదానికి (Odisha trains accident) కారణం ఏమిటన్న దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్లోకి తప్పుగా వెళ్లడమే ప్రమాదానికి అసలు కారణమని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి ముందు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ తప్పుడు ట్రాక్‌లో ప్రయాణించినట్లు రైల్వే సిగ్నలింగ్ కంట్రోల్ రూమ్ ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తున్నది. శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు బహానగర్ బజార్ స్టేషన్‌కు ముందు ఉన్న మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్లో ఆ రైలు ప్రయాణించినట్లు రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను బహనగా ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. కుప్పలు కుప్పలుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రభుత్వ పాఠశాల.. మార్చురీగా మారిపోయింది. ఆ మృతుల్లో తమ వారెవరైనా ఉన్నారో అని తెలుసుకునేందుకు ఆ పాఠశాల వద్దకు జనాలు క్యూ కట్టారు. కానీ మృతదేహాలను గుర్తించలేని స్థితిలో మారిపోయాయి.
అయితే పలు మృతదేహాల వద్ద మొబైల్స్ ఫోన్స్ మోగాయి. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న తమ వారు క్షేమంగా ఉన్నారో.. లేదో తెలుసుకునేందుకు ఆత్మీయులు, బంధువులు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఆ ఫోన్ కాల్స్ వల్ల మృతదేహాలను గుర్తించడం తేలికైంది. తమ బంధువులు, ఆత్మీయులు ఫోన్లు చేస్తుండటంతో.. ఆ ఫోన్లను అధికారులు, పోలీసులు లిఫ్ట్ చేసి వారికి సమాచారం ఇచ్చారు. దీంతో పలు మృతదేహాలను గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న బహనాగా స్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లు వేర్వేరు మృతుల సంఖ్య(Death Toll)ను వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ.. రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 500 దాటినట్లు తనకు సమాచారం ఉందని మమతా బెనర్జీ అన్నారు. అయితే ఆ సమయంలో అక్కడ దీదీ పక్కన నిలుచున్న రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ జోక్యం చేసుకుని, ఒడిశా ప్రభుత్వ డేటా ప్రకారం కేవలం 238 మంది మరణించినట్లు వెల్లడించారు.
రైల్వే మంత్రి వైష్ణవ్ జోక్యం చేసుకున్న తర్వాత మమతా బెనర్జీ మళ్లీ జోక్యం చేసుకుని శుక్రవారం రాత్రి వరకే 238 మంది మరణించినట్లు ఆమె చెప్పారు. ఇంకా మూడు కోచ్‌ల్లో రెస్క్యూ పని పూర్తి కాలేదని, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆమె తెలిపారు. యాంటీ కొలిజిన్ కవచ్ వ్యవస్థ ఆ రెండు రైళ్లలో లేదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం.. ఒడిశా రైలు ప్రమాదంలో 261 మంది మృతిచెందారు. 900 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని గోపాల్‌పుర్, ఖాంతాపుర, బాలాసోర్, భద్రక్, సోరో, కటక్ ఆస్పత్రుల్లో చేర్పించారు.
ఒడిశాలోని బాలసోర్‌కు చెందిన యువకులు మానవత్వం చాటుకున్నారు. రైలు ప్రమాదం గురించి తెలియగానే క్షతగాత్రులకు రక్తం అవసరం పడుతుందనే ఉద్దేశంతోనే రాత్రికి రాత్రే స్వచ్ఛందంగా ఆస్పత్రికి తరలివచ్చారు. వందలాది మంది యువకులు ఆస్పత్రికి చేరుకుని రక్తదానం చేశారు. ఇప్పటివరకు యువకుల నుంచి 3 వేల యూనిట్ల రక్తం సేకరించామని ఎస్సీబీ మెడికల్ కాలేజి ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ పండా వెల్లడించారు.
ఒడిశా రైలు ప్రమాదంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Deeply saddened by the loss of hundreds of lives in a train accident in India. I extend my heartfelt condolences to the bereaved families who lost their loved ones in this tragedy. Prayers for speedy recovery of the injured.
— Shehbaz Sharif (@CMShehbaz) June 3, 2023
ఒడిశా రైలు ప్రమాదంపై రష్యా, టర్కీ దేశాలు స్పందించాయి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపాయి. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించాయి.
Russian President Vladimir Putin sent his condolences to President of India Droupadi Murmu and Prime Minister Narendra Modi over the deadly train collision in the Indian state of Odisha: Russian Embassy in India
“We share the grief of those who lost their loved ones in this… pic.twitter.com/mz2EX9HRF5
— ANI (@ANI) June 3, 2023
Turkiye
Sonia Gandhi
ఒడిశా రైలు ప్రమాద ఘటన తనను కలచివేసిందని కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియాగాంధీ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఒడిశా రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సూచించారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని అభిప్రాయపడ్డారు. బాధితులకు సరైన వైద్యం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం అందిస్తుందని.. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు.
#WATCH | At the site of #BalasoreTrainAccident, West Bengal CM and former Railways Minister Mamata Banerjee says, "Coromandel is one of the best express trains. I was the Railway Minister thrice. From what I saw, this is the biggest railway accident of the 21st century. Such… pic.twitter.com/aOCjfoCbvF
— ANI (@ANI) June 3, 2023
ఒడిశా రైలు ప్రమాదంపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు జపాన్ ప్రభుత్వం, ప్రజల తరఫున సానుభూతి తెలిపారు. గాయపడినవారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఒడిశా రైలు ప్రమాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఉక్రెయిన్ ప్రజల తరఫున సానుభూతి తెలిపారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
On behalf of myself and the people of Ukraine, I express my deepest condolences to Prime Minister @narendramodi and all relatives and friends of those killed in the train accident in the state of Odisha. We share the pain of your loss. We wish a speedy recovery for all those…
— Володимир Зеленський (@ZelenskyyUa) June 3, 2023
ఒడిశా రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తయినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో సహాయక చర్యలు అందించేందుకు భారత వాయుసేన రంగంలోకి దిగింది. ఎంఐ-17 హెలికాప్టర్ల ద్వారా రైలు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను తరలించనున్నారు.
Pm Modi
ఒడిశా రైలు ప్రమాదంపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఘటనాస్థలికి బయల్దేరి వెళ్లారు. కటక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు.
రైలు ప్రమాదంలో గాయపడిన వారిని తరలించిన ఆస్పత్రిని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సందర్శించారు. బాధితులను కలిసి వారి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. అలాగే క్షతగాత్రులకు అందుతున్న వైద్య సహాయంపై డాక్టర్లతో మాట్లాడారు.
Naveen Patnaik1
Naveen Patnaik2
ఒడిశా రైలు ప్రమాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూర్-హౌరా సూపర్ ఫాస్ట్ రైళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అన్నారు. బాధిత ప్రయాణికులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. రైలు ప్రమాదాల నివారణకు సంబంధించిన భద్రత చర్యలపై తక్షణ దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
Janasena
ఒడిశా రైలు ప్రమాదంపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థించారు. సేఫ్టీలో కీ రోల్ ప్లే చేసే యాంటీ కొలిజిన్ సిస్టమ్ ఏమైందని ప్రశ్నించారు. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని.. ఇలాంటివి మళ్లీ జరగకూడదని ఆకాంక్షించారు.
Aghast at the horrific train collision that killed 233 passengers and left many more wounded
My heartfelt condolences & prayers to all the families of the passengers who lost their loved ones and those affected 🙏
What happened to the Anti Collision Devices ? This is indeed a…
— KTR (@KTRBRS) June 3, 2023
ఒడిశా రైలు ప్రమాదంపై టీమిండియా క్రికెట్ విరాట్ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Saddened to hear about the tragic train accident in Odisha. My thoughts and prayers go out to the families who lost their loved ones and wishing a speedy recovery to the injured.
— Virat Kohli (@imVkohli) June 3, 2023
#WATCH | Aerial visuals from ANI’s drone camera show the extent of damage at the spot of the #BalasoreTrainAccident in Odisha. pic.twitter.com/8rf5E6qbQV
— ANI (@ANI) June 3, 2023
రైలు ప్రమాద ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(CM Naveen Patnaik) స్పందించారు. బాలాసోర్ రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. రాత్రి అంతా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న స్థానిక ప్రజలకు, రెస్క్యూ బృందాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నుజ్జునుజ్జు అయిన బోగీల్లో చిక్కుకున్న వారిని రక్షించినట్లు తెలిపారు. రైల్వే భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. గాయపడ్డవారిని బాలాసోర్, కటక్ ఆస్పత్రులకు తీసుకువెళ్లినట్లు సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు.
#WATCH | Odisha CM Naveen Patnaik says, "...extremely tragic train accident...I have to thank the local teams, local people & others who have worked overnight to save people from the wreckage...Railway safety should always be given the first preference...The people have been… pic.twitter.com/PtyESk4ZuB
— ANI (@ANI) June 3, 2023
ఒడిశా రైలు ప్రమాదంపై తైవాన్ ప్రెసిడెంట్ ట్సాయి ఇంగ్ వెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
Praying for everyone affected by the train accident in India. I extend my heartfelt condolences to the victims and their families, and hope that rescue operations can save all those in need.
— 蔡英文 Tsai Ing-wen (@iingwen) June 3, 2023
ఒడిశా దుర్ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో విచారం వ్యక్తం చేశారు. ఒడిశా రైలు ప్రమాద ఘటన తన హృదయాన్ని కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం తెలిపారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత ప్రజలకు కెనడా దేశం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
The images and reports of the train crash in Odisha, India break my heart. I’m sending my deepest condolences to those who lost loved ones, and I’m keeping the injured in my thoughts. At this difficult time, Canadians are standing with the people of India.
— Justin Trudeau (@JustinTrudeau) June 3, 2023
ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఘటనాస్థలికి ముగ్గురు అధికారుల బృందాన్ని పంపించాలని ఆదేశించారు. అంతకుముందు ట్విట్టర్ వేదికగా ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన దురదృష్టకరమని.. రైల్వే అధికారులతో మాట్లాడి ఏపీకి చెందిన బాధితుల వివరాలు సేకరిస్తున్నామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి మనస్థైర్యం ఇవ్వాలని దేవుణ్ని ప్రార్థించారు.
#BalasoreTrainAccident | The train accident in Odisha is unfortunate. We are talking to the railway officials and collecting the details of the victims from Andhra Pradesh. My deepest condolences to the bereaved families. I pray to God to give them peace of mind: Andhra Pradesh… pic.twitter.com/0O4sU7G7Os
— ANI (@ANI) June 3, 2023
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ఉన్నతాధికారులతో తమిళనాడు సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ.. ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో మాట్లాడానని తెలిపారు. తమిళనాడుకు చెందిన బాధితుల వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా, బాలాసోర్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి మంత్రులు ఉదయనిధి స్టాలిన్, శివశంకర్, అనిల్ మహేశ్‌తో సహా అధికారుల బృందం బయల్దేరి వెళ్లింది.
#WATCH | Tamil Nadu CM MK Stalin takes stock of the situation at the State Emergency Operation Centre in Chennai#BalasoreTrainAccident pic.twitter.com/2fZYOkJjx9
— ANI (@ANI) June 3, 2023
ఒడిశా రైలు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన 35 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 50 మంది బాధితులను ప్రత్యేక విమానంలో చెన్నైకి తరలించారు.
ఒడిశా దుర్ఘటన నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఒడిశా యువత కదలివచ్చింది. రైలు ప్రమాదంలో గాయపడిన వారికి రక్తదానం చేసేందుకు ఒడిశా యువకులు తరలివస్తున్నారు. పెద్ద ఎత్తున బాలాసోర్ ఆస్పత్రికి చేరుకుని రక్తదానం చేసి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
Odisha train accident: People queue up to donate blood for injured in Balasore
Read @ANI Story | https://t.co/McDb1XajsF#Odisha #OdishaTrainTragedy #Balasore pic.twitter.com/DlIFwcZmns
— ANI Digital (@ani_digital) June 3, 2023
రైలు ప్రమాదం జరిగిన స్థలాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
#WATCH | Railways Minister Ashwini Vaishnaw thanks NDRF officials who are actively engaged in the search and rescue operation in #Balasore#OdishaTrainTragedy pic.twitter.com/AcQvmexrr8
— ANI (@ANI) June 3, 2023
ఒడిశా రైలు ప్రమాద బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఒడీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రైలు బోగీల్లో చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితులను ఆస్పత్రులను తరలించేందుకు ఘటనాస్థలిలో 200 అంబులైన్స్లను అందుబాటులో ఉంచినట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది.
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 280 దాటింది. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది.
రైలు ప్రమాదం కారణంగా పట్టాలపై బోగీలు పడి ఉండటంతో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. బాలేశ్వర్ మీదుగా వెళ్లే 43 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. మరో 38 రైళ్లను దారి మళ్లించారు.
ఒడిశాలోని (Odish) బాలేశ్వర్ (Baleshwar) సమీపంలోని బహనాగ్‌బజార్ వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంతో ఆంధ్రప్రదేశ్ వాసులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదానికి గురైన రెండు రైళ్లలో (Odisha Train accident) పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌కు (Andhrapradesh) చెందినవారు ఉన్నట్లు తెలుస్తున్నది.
రైలులో షాలిమార్, ఖరగ్‌పూర్, సంత్రగచ్చి, బాలేశ్వర్ స్టేషన్లలో ఎక్కిన ప్రయాణికుల్లో రాజమండ్రిలో 22 మంది, విజయవాడలో 47 మంది, ఏలూరులో ఒకరు మొత్తంగా 70 మంది దిగాల్సి ఉన్నది. ఇదే రైలులో రాజమండ్రి స్టేషన్ నుంచి 56 మంది, తాడేపల్లిగూడలో 10 మంది, ఏలూరులో 44 మంది, విజయవాడలో 120 మంది ప్రయాణికులు ఎక్కారు. వారంతా చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు టికెట్లు రిజర్వు చేసుకున్నారు.
ఇక కర్ణాటకలోని యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస స్టేషన్ల మీదుగా వెళ్లింది. అయితే తిరుపతి, రేణిగుంట, చీరాల స్టేషన్ల నుంచి ఖరగ్‌పూర్, హౌరా వైపు 52 మందికిపైగా ప్రయాణికులు వెళ్లినట్లు తెలుస్తున్నది.
#WATCH | Odisha | Search and rescue operation underway for #BalasoreTrainAccident that claimed 233 lives so far.
As per State's Chief Secretary Pradeep Jena, one severely damaged compartment still remains and NDRF, ODRAF & Fire Service are working to cut through it to try to… pic.twitter.com/BQZSm0JQ4z
— ANI (@ANI) June 3, 2023
రైలు ప్రమాదంపై వివరాలు అందించేందుకు రైల్వే శాఖ అధికారులు పలు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. అవి..సికింద్రాబాద్ రైల్ నిలయం (040 27788516), విజయవాడ రైల్వే స్టేషన్ (0866 2576924), రాజమండ్రి రైల్వే స్టేషన్ (0883 2420541), రేణిగుంట రైల్వే స్టేషన్ (9949198414), తిరుపతి రైల్వే స్టేషన్ (781595571), విజయనగరం హెల్ప్‌లైన్ (08922 221202, 221206), ఒడిశా ప్రభుత్వం ఏర్పాటుచేసిన నంబర్ 06782-26228 సహాయ కేంద్రాలకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని రైల్వే వర్గాలు వెల్లడించాయి.
ఒడిశా రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Deeply anguished to know about the loss of lives in an unfortunate rail accident in Balasore, Odisha. My heart goes out to the bereaved families. I pray for the success of rescue operations and quick recovery of the injured.
— President of India (@rashtrapatibhvn) June 2, 2023
Distressed by the train accident in Odisha. In this hour of grief, my thoughts are with the bereaved families. May the injured recover soon. Spoke to Railway Minister @AshwiniVaishnaw and took stock of the situation. Rescue ops are underway at the site of the mishap and all…
— Narendra Modi (@narendramodi) June 2, 2023
ఒడిశాలో జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకర ఘటన అని ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు మృత్యువాత పడటం, మరెందరో తీవ్రంగా గాయపడటం పట్ల సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను తగిన రీతిలో ఆదుకొని, వారికి భరోసా కల్పించాలని కోరారు.
రైల్వే అధికారి అమితాబ్ శర్మ ప్రకటన ప్రకారం ఆగి ఉన్న గూడ్స్ రైలును షాలిమార్-కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని పట్టాలు తప్పడంతో 10-12 బోగీలు పక్కనున్న ట్రాక్‌పై పడ్డాయి. ఆ తర్వాత కొంత సేపటికి కోరమాండల్ బోగీలు పడిన ట్రాక్‌పైకి వచ్చిన యశ్వంత్‌పూర్-హౌరా రైలు ఈ బోగీలను ఢీ కొన్నాయి. ఈ ఘటనలో యశ్వంత్‌పూర్-హౌరా రైలు బోగీలు 3-4 పట్టాలు తప్పాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.