Odisha Train Accident | ఒడిశా రైలు దుర్ఘటనపై కేసు నమోదు చేసిన సీబీఐ
Odisha Train Accident | ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మంగళవారం కేసు నమోదు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వం సూచనల మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.
Odisha Train Accident | ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మంగళవారం కేసు నమోదు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వం సూచనల మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ నెల 2న ఒడిశాలోని బహనాగా బజార్ రైల్వేస్టేషన్కు సమీపంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్-హౌరా ఎక్స్ప్రెస్తో పాటు గూడ్స్ రైలు ప్రమాదంపై కేసు నమోదు చేసేందుకు డీవోపీటీ సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత సీబీఐ బృందం బాలాసోర్ చేరుకుంది. ప్రమాదంపై ఈ నెల 3న జీఆర్పీఎస్ కేసు ప్రకారం సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా పది మంది సభ్యుల సీబీఐ బృందం ఒడిశా చేరుకుంది.
గత శుక్రవారం బాలాసోర్ జిల్లాలో జరిగిన ఈ రైలు దుర్ఘటనలో 278 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ రైల్వే బోర్డు ఆదివారం నిర్ణయం తీసుకుంది. సౌత్ ఈస్టర్న్ రైల్వే సీపీఆర్వో ఆదిత్య కుమార్ చౌదరి మాట్లాడుతూ ఫోరెన్సిక్, సీబీఐ బృందం సంఘటనా స్థలంలో ఉందని, సాక్ష్యాలను సేకరిస్తున్నారన్నారు. రైల్వే సీబీఐ బృందానికి సహాయం అందిస్తుందని తెలిపారు. సీబీఐ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. ఖరగ్పూర్, బాలాసోర్తో సహా పలు ప్రాంతాల్లో రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) బృందం సైతం పని చేస్తోందని, మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

