భువనేశ్వర్ : ఒడిశాలో 40 ఏండ్ల వ్యక్తి కేవలం 10 రూపాయల కోసం కన్నతండ్రిని కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం తెగిన తలను పట్టుకొని వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గుట్కా, పొగాకు కొనేందుకు తండ్రి డబ్బులు ఇవ్వలేదని ఈ కిరాతకానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన మంగళవారం ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బరిపాద గ్రామంలో జరిగింది.