ఒడిశాలో ఇద్దరు రష్యన్ల మృతిపై సీఐడీ దర్యాప్తు
ఒడిశాలోని ఓ హోటల్లో ఇద్దరు రష్యన్లు మృతిచెందిన ఘటనలపై రాష్ట్ర సీఐడీ దర్యాప్తు చేపట్టింది. రాయగడలోని హోటల్లో రెండురోజుల వ్యవధిలో ఈ మరణాలు చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తున్నది.
భువనేశ్వర్, డిసెంబర్ 28: ఒడిశాలోని ఓ హోటల్లో ఇద్దరు రష్యన్లు మృతిచెందిన ఘటనలపై రాష్ట్ర సీఐడీ దర్యాప్తు చేపట్టింది. రాయగడలోని హోటల్లో రెండురోజుల వ్యవధిలో ఈ మరణాలు చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు బుధవారం దర్యాప్తును ప్రారంభించారు. తోటి ప్రయాణికులు, టూర్ గైడ్ను విచారణ చేస్తున్నట్టు వారు వెల్లడించారు. రష్యా ఎంపీ, వ్యాపారవేత్త పావెల్ ఆంటోవ్(65) ఈనెల 24న హోటల్ మూడో ఫ్లోర్ నుంచి కిందపడి మరణించారు.
అంతకుముందు 22న అతని సహచర ప్రయాణికుడు వ్లాదిమిర్ బిడెనోవ్ హోటల్లోని తన రూమ్లో అనుమానాస్పద రీతిలో చనిపోయి ఉన్నాడు. కాగా, భవనంపై నుంచి పడటంతో తీవ్ర గాయాలతో ఎంపీ ఆంటోవ్, గుండెపోటు కారణంగా బిడెనోవ్ మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలు పేర్కొన్నాయని పోలీసులు తెలిపారు. రష్యా దౌత్యకార్యాలయం వినతి మేరకు దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు
తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

