ఒడిశా: చేపల వేట అంటే చాలా మంది ఇష్టపడుతారు. కొందరు బతుకుదెరువు కోసం చేపలు పడితే, మరికొందరు జిహ్వ చాపల్యంతో చేపలు పడుతారు. ఇంకొందరు కేవలం సరదా కోసం చేపలు పడుతుంటారు. చేపలు పట్టడంలో ఎవరి ఉద్దేశం ఏదైనా వారు చేపల కోసం వేసిన వలలో చేపలకు బదులుగా పాము చిక్కితే పై ప్రాణాలు పైకే పోతాయి. అరుదుగానైనా కొంతమందికి ఇలాంటి సందర్భాలు అప్పుడప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి.
తాజాగా ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాలోని గొలముందా ఏరియాలోగల గంగా సాగర్ చెరువులో ఓ జాలరికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చేపల కోసం వలవేస్తే ఏకంగా ఏడు అడుగుల పొడవున్న కొండచిలువ చిక్కింది. దాంతో ఒక్కసారిగా షాకైన అతను ఆ తర్వాత తేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దాంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న అధికారులు కొండచిలువను వల నుంచి విడిపించి తీసుకెళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
పేక మేడలా కూలి నదిలో మునిగిన ఇల్లు.. వీడియో