Bihar | పాట్నా, డిసెంబర్ 31: కబ్జాదారులు రాత్రికి రాత్రే ఏకంగా ఒక చెరువును మాయం చేసిన ఘటన బీహార్లో చోటుచేసుకుంది. దర్భాంగ జిల్లాలో నీటి వనరులతో ఉన్న ఒక ప్రభుత్వ చెరువును కొందరు కబ్జాదారులు రాత్రికి రాత్రే ఖాళీ చేసి దానిని ఇసుకతో పూడ్చేసి చదును చేసి అక్కడొక గుడిసెను నిర్మించారు. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని చూసిన వారెవరైనా అంతకుముందు అక్కడొక చెరువు ఉండేదంటే నమ్మలేని విధంగా కబ్జాదారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
పెద్దయెత్తున ట్రక్కులు, ప్రొక్లయినర్లు అక్కడికి రాకపోకలు సాగించడంతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కబ్జా ఎవరు చేశారో తెలియదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దర్భాంగ డీఎస్పీ కుమార్ తెలిపారు.