ఒక్క రోజే 752 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా 752 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల నలుగురు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 3,420 యాక్టివ్ కేసులుండగా, కేరళలో ఈ తరహా కేసుల సంఖ్య 2 వేలు దాటింది.
- కేరళలో 2 వేలు దాటిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 23: దేశంలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా 752 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల నలుగురు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 3,420 యాక్టివ్ కేసులుండగా, కేరళలో ఈ తరహా కేసుల సంఖ్య 2 వేలు దాటింది. కొత్త కేసులు న్యూఢిల్లీ, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పంజాబ్, తమిళనాడు, తెలంగాణలో నమోదయ్యాయి. క్రిస్మస్ పండగ తరుణంలో దేశంలో జేఎన్.1 వేరియంట్ వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా 52 శాతం పెరుగుదల
గత నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కొత్త కేసులు 52 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. నెల రోజుల్లో 8,50,000 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. 1,18,000 మంది కొవిడ్ వల్ల దవాఖానలో చేరారని తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు జేఎన్.1 రకం వల్ల కలిగే ప్రాణాపాయాన్ని, తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తున్నదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. కొవిడ్‌తో పాటు ఫ్లూ, పిల్లల్లో వచ్చే సాధారణ నిమోనియా వంటి శ్వాసకోశ వ్యాధుల తీవ్రత కూడా ఎక్కువగా ఉందని ప్రకటించింది. మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, లక్షణాలు కనిపించినప్పుడు టెస్ట్ చేయించుకోవాలని ప్రజలకు సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

