Nuh violence | హర్యానా (Haryana)లోని నుహ్ (Nuh violence) జిల్లాలో జరిగిన హింస కేసులో అరెస్టైన గో సంరక్షకుడు (Cow vigilante) బిట్టు భజరంగీ (Bittu Bajrangi)కి తాజాగా బెయిల్ (Bail) మంజూరైంది. జులై 31న హిందూ సంస్థ నిర్వహించిన ఊరేగింపులో నుహ్‌లో మత ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో ప్రధాన నిందితుడిగా ఉన్న అతడిని ఈనెల 15న పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరైంది.
భజరంగ్ దళ నేత మోనూ మనేసర్‌తో బిట్టు భజరంగీకి చాలా క్లోజ్ సంబంధాలు ఉన్నాయి. నుహ్‌లో జరిగిన మత ఘర్షణల్లో బిట్టు రెండవ కీలక నిందితుడు. ఆ రోజు జరిగిన ర్యాలీలో బిట్టు కూడా పాల్గొన్నాడు. తొలుత ఆగస్టు 4వ తేదీన అరెస్టు చేసి అతన్ని బెయిల్‌పై రిలీజ్ చేశారు. మళ్లీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీ సమయంలో దాడి కోసం బిట్టు గ్యాంగ్ ఆయుధాలు వాడినట్లు తెలిసింది. ఆ ఆయుధాలను పోలీసులు సీజ్ చేశారు.
బిట్టు భజరంగీని రాజ్‌కుమార్ అని కూడా పిలుస్తారు. అతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి. అల్లర్లు, చోరీలు, బెదిరింపులకు పాల్పడినట్లు కేసులు ఉన్నాయి. గో సంరక్షణ భజరంగ్ ఫోర్స్ పేరుతో ఓ సోషల్ మీడియా గ్రూపును నడుపుతున్నారు. ఆ గ్రూపును జంతు సేవాసమితిగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లవ్ జిహాదీపై ఆ గ్రూపు అనేక పోస్టులు చేసింది.
Also Read..
Asia Cup 2023 | ఆసియా కప్ కోసం శ్రీలంక చేరుకున్న భారత జట్టు
Praggnanandhaa | ఆనంద్ మహీంద్రాకు థ్యాంక్స్ చెప్పిన ప్రజ్ఞానంద.. ఎందుకంటే..?
Cabin Crew | విమానం రెక్కలపై నిల్చుని ఫొటోలకు ఫోజులిచ్చిన సిబ్బంది.. వీడియో