Asia Cup 2023 | ఆసియా కప్ కోసం శ్రీలంక చేరుకున్న భారత జట్టు
Asia Cup 2023 | క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసియా కప్ -2023 ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ (Asia Cup 2023) కోసం భారత జట్టు (Team India) తాజాగా శ్రీలంక చేరుకుంది.
Asia Cup 2023 | క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసియా కప్ -2023 ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ (Asia Cup 2023) కోసం భారత జట్టు (Team India) తాజాగా శ్రీలంక చేరుకుంది. బుధవారం ఉదయం కొలంబో ( Colombo) ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Team India arrived in Colombo for the #Asiacup @BCCI @imVkohli pic.twitter.com/bDSdebu3mu
— vipul kashyap (@kashyapvipul) August 30, 2023
ఈ ఏడాది ఆసియాకప్ శ్రీలంక, పాకిస్థాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భారత్ ఆడే మ్యాచ్‌లకు శ్రీలంక వేదిక కానుంది. నేడు మొదటిరోజు (ఆగస్టు 30) పాకిస్థాన్ జట్టు నేపాల్‌తో అమీతుమీ తేల్చుకోబోతోంది. ఇందులో భాగంగా వన్డే మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇక భారత్ తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న పల్లెకెలె వేదికగా దాయాది దేశం పాకిస్థాన్ ( Pakistan)తో తలపడబోతోంది.
సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పాల్గొనని విషయం తెలిసిందే. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఎదురుపడుతున్న దాయాదుల మధ్య ఈ టోర్నీలో రసవత్తర పోటీ సాగనుంది. బలాబలాలను పరీక్షించుకునేందుకు ఈ టోర్నీని వినియోగించుకోవాలని అన్నీ జట్లు ఆశిస్తున్నాయి. వన్డే ఫార్మాట్లో జరుగనున్న ఈ టోర్నీ ద్వారా కూర్పును పరీక్షించుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఇప్పటి వరకు అత్యధికంగా ఏడు సార్లు ఆసియాకప్ కైవసం చేసుకున్న భారత్.. ఈ సారి కూడా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది.
ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయష్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, సంజూ సామ్సన్ (బ్యాకప్)
Team India landed in Colombo.
A small glimpse of Rohit Sharma. pic.twitter.com/4Ivzb65Oo0
— Aru ★ (@Aru_Ro45) August 30, 2023
Also Read..
Praggnanandhaa | ఆనంద్ మహీంద్రాకు థ్యాంక్స్ చెప్పిన ప్రజ్ఞానంద.. ఎందుకంటే..?
Cabin Crew | విమానం రెక్కలపై నిల్చుని ఫొటోలకు ఫోజులిచ్చిన సిబ్బంది.. వీడియో
Putin | అరెస్ట్ వారెంట్ తర్వాత.. తొలిసారి దేశ సరిహద్దులు దాటనున్న పుతిన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

