న్యూఢిల్లీ: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రంలోని అధికార బీజేపీ ఎన్నికల బాండ్ల నోటిఫికేషన్ జారీ చేయడంపై మాజీ బ్యూరోక్రాట్ ఈఏఎస్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బాండ్ల ద్వారా విరాళాల సేకరణకు తాజా నోటిఫికేషన్ జారీ చేయటం ఎన్నికల నిబంధనావళికి విరుద్ధమని విమర్శించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. విరాళాల్లో అత్యధిక భాగం అధికార బీజేపీకి దక్కుతాయని, తద్వారా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆరోపించారు.