న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న జరిగే ఈ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్టు పేర్కొంది. ఆగస్టు 21 నామినేషన్లు దాఖలు చేయడానికి చివరితేదీ.
నామినేషన్ పత్రాల పరిశీలన ఆగస్టు 22న జరగనున్నది. ఆగస్టు 25 నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ. గత నెల 21న ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది.