ముంబై : నార్వే డ్యాన్స్ టీం క్విక్ స్టైల్ భారత్ టూర్లో సందడి చేస్తోంది. కాలా చష్మా సాంగ్ వైరల్ (Viral Video) కావడంతో ఈ ఆల్ బాయ్స్ గ్యాంగ్ ఇక వెనక్కితగ్గలేదు. తొలిసారిగా భారత్‌ను సందర్శించిన నార్వే డ్యాన్స్ టీం ఇప్పటికే విరాట్ కోహ్లీ, సునీల్ శెట్టి, రవీనా టాండన్‌లతో డ్యాన్స్ మూమెంట్స్‌తో హల్చల్ చేయగా తాజాగా ముంబై మాల్లో శ్రేయ ఘోషల్, అతిఫ్ అస్లాం ఆలపించిన తేరే లియా సాంగ్‌కు క్రేజీ స్టెప్స్‌తో ఉర్రూతలూగించారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వైరల్ క్లిప్‌ను క్విక్ స్టైల్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ వీడియోలో నార్వే డ్యాన్స్ బృంద సభ్యులంతా సూట్స్‌లో కనిపిస్తూ పాపులర్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. వీరి కిల్లర్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అక్కడ చేరిన జనాలు చప్పట్లతో హోరెత్తించారు.
ముంబైలోని ఫీనిక్స్ మార్కెట్ సిటీలో వీరి డ్యాన్స్ పెర్ఫామెన్స్ హైలైట్‌గా నిలిచింది. తమను కలిసి తమ పెర్ఫామెన్స్ చూసేందుకు వేలాదిమంది తరలివస్తారని తామెన్నడూ ఊహించలేదని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు 30 లక్షలు పైగా వ్యూస్ లభించాయి.
Read More :