న్యూయార్క్ : ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ పలువురితో స్టెప్పులేయించింది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో నాటు నాటుకు ఆస్కార్ అవార్డు లభించింది. నాటు నాటు సాంగ్ హుషారైన బీట్స్‌కు అనుగుణంగా టెస్లా కార్ల లైట్ షో వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
.@Teslalightshows light sync with the beats of #Oscar Winning Song #NaatuNaatu in New Jersey 🤩😍
Thanks for all the love. #RRRMovie @Tesla @elonmusk pic.twitter.com/wCJIY4sTyr
— RRR Movie (@RRRMovie) March 20, 2023
ఈ వైరల్ క్లిప్‌ను ఆర్ఆర్ఆర్ మూవీ అధికారిక ట్విట్టర్ ఖాతా షేర్ చేసింది. నిమిషం పైగా నిడివికలిగిన ఈ వీడియోలో పార్కింగ్ ప్లేస్‌లో నిలిచినఉన్న టెస్లా కార్లు కనిపిస్తాయి.
నాటు నాటు సాంగ్ క్రేజీ బీట్స్‌కు అనుగుణంగా టెస్లా కార్ల హెడ్ లైట్స్ బ్లింక్ అవడం ఆ లైట్ షో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. న్యూయార్క్‌లో ఈ ఘటన జరిగిందని పోస్ట్ క్యాప్షన్ వెల్లడిస్తోంది. ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకూ 50,000కుపైగా వ్యూస్ లభించాయి.
Read More :