Viral Video | లండన్ వీధుల్లో తేరే జమీన్ పర్ సాంగ్ ఆలపించాడు
2007లో విడుదలైన తారే జమీన్ పర్ మూవీలోని "మా" సాంగ్ ఇప్పటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంది. ఈ పాటను లండన్ వీధుల్లో ఓ వ్యక్తి శ్రావ్యంగా ఆలపించిన వీడియో (Viral Video) నెట్టింట తెగవైరలవుతోంది
లండన్ : 2007లో విడుదలైన తారే జమీన్ పర్ మూవీలోని “మా” సాంగ్ ఇప్పటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంది. ఈ పాటను లండన్ వీధుల్లో ఓ వ్యక్తి శ్రావ్యంగా ఆలపించిన వీడియో (Viral Video) నెట్టింట తెగవైరలవుతోంది. ఈ వైరల్ క్లిప్‌ను విష్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ వీడియోలో విష్ లండన్ వీధుల్లో మా సాంగ్‌ను పాడుతుండటం కనిపిస్తుంది.
విష్ పాటను ఆస్వాదిస్తూ చుట్టూ పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడి అతడిని ప్రోత్సహించడం కనిపిస్తుంది . బ్రిటన్‌లో తల్లి దినోత్సవ వేడుకలు జరుపుకునే మార్చి 19న ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందరూ కలిసి ఈ పాటను అద్భుతంగా ఆలపించారు..విదేశీ గడ్డపై నిలదొక్కుకోవడం ఎంత కష్టమో తాను ఇక్కడ ఎలా ఉండగలిగానో ఊహించుకోవచ్చు..ముఖ్యంగా ఇక్కడి విద్యార్ధుల గురించి ప్రస్తావించాలి..ఈ ప్రయాణంలో నా వెన్నంటి నిలిచిన నా తల్లిని గుర్తుచేసుకోవాలి..మీరూ మీ తల్లులు ఎలా ఉన్నారని రోజూ పలకరించండి..అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు..నిన్న నా కార్యక్రమానికి వచ్చిన వారందరికీ థ్యాంక్స్ అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను ఇప్పటివరకూ 4 లక్షల మంది వీక్షించారు. విష్ పెర్ఫామెన్స్‌కు ఇన్స్టాగ్రాం యూజర్లు ఫిదా అయ్యారు. కామెంట్స్ సెక్షన్లో అతడిపై ప్రశంసలు గుప్పించారు. మా పాటను శంకర్ మహదేవన్ ఆలపించగా ప్రసూన్ జోషీ సాహిత్యాన్ని
సమకూర్చారు.
Read More :
Boy Carries Crocodile | మొసలిని వీపుపై మోసుకెళ్లిన బాలుడు.. వీడియో వైరల్
Ravanasura | రవితేజ మాస్ ఎనర్జిటిక్ వైబ్‌తో రావణాసుర కొత్త సాంగ్.. టైం ఫిక్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- busker
- Maa song
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

