Non Veg Goat | మేకలు అంటేనే శాకాహారులు. అవి తినేదే ఆకులు, చిన్న చిన్న మొక్కలు. ఏవైనా గింజలు దొరికితే వాటిని తింటాయి. అంతకుమించి అవి పెద్దగా తినేదేం ఉండదు. గొర్రె జాతికి చెందిన ఏ జంతువైనా తినేది అవే. అవి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు, వాటి ఆకులను తింటాయి కాబట్టే.. వాటిని తినే మేకలు, గొర్రెలను మనం కోసుకొని తింటాం.
కానీ.. ఓ మేక మాత్రం వెరైటీగా ఆకులు తినదు. మొక్కలను తినదు. అది తినేది కేవలం చికెన్, మటన్. అవును.. చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఆ మేక నాన్ వెజ్ మేక. చికెన్ బిర్యానీ లేకుంటే దానికి ముద్ద దిగదు. ముక్క లేకుంటే ముద్ద దిగదన్నమాట. ఇలా నాన్ వెజ్ తినే మేకలు ఉండటం చాలా విచిత్రం. అయితే.. ఇప్పటి వరకు అలా నాన్ వెజ్ తిన్న మేక ఎక్కడా కనిపించలేదు కానీ.. ఇటీవల ఓ మేక చేపలు తినడం మాత్రం చూశాం. కానీ.. ఈ మేక చికెన్, మటన్, చేపలు, గుడ్లు అన్నీ లాగించేస్తుంది.
అన్నట్టు ఈ మేకకు ఓ పేరు కూడా ఉందండోయ్. భురి దాని పేరు. మధ్యప్రదేశ్లోని లోహరి అనే గ్రామానికి చెందిన రైతు రఫిక్దే ఈ మేక. ఈ మేక గురించి తెలుసుకున్న స్థానికులు దాన్ని వెరైటీగా చూడటం మొదలు పెట్టారు.
దీనికి చిన్నప్పటి నుంచి చికెన్ బిర్యానీ తినడం అలవాటు అయింది. దీంతో ప్రతి రోజు దానికి చికెన్ బిర్యానీ తెచ్చి పెడుతున్నా. ఏవైనా ఫంక్షన్లు అయినప్పుడు మటన్, చేపలు పెడుతుంటాం. గుడ్లు కూడా తింటుంది. ఇది ఇక్కడే పుట్టింది. గత మూడేళ్ల నుంచి ఇది నాన్ వెజ్ తినడం అలవాటు చేసుకుంది. ప్రతి రోజూ చికెన్ బిర్యానీ ఉండాల్సిందే. ఆకులు, మొక్కల వైపు కన్నెత్తి కూడా చూడదు.. అంటూ ఆ మేక యజమాని రఫిక్ చెప్పుకొచ్చాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇయర్ ఎండ్.. 2021లో మహిళల కోసం జందగీలో వచ్చిన ప్రత్యేక కథనాలు ఇవే
భారత్కు యూనిసెఫ్ ఫోటో ఆప్ ది ఇయర్ అవార్డు..