న్యూఢిల్లీ, జనవరి 26 : ఉత్తర భారతంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించాలని బద్రినాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ నిర్ణయించింది.
గంగోత్రి, ముక్భా, బద్రినాథ్, కేదార్నాథ్ సహా బీకేటీఎస్ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశంపై నిషే ధం విధించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు చేపట్టిన తీర్మానాన్ని ఆదివారం బీకేటీఎస్ ఆలయ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించనున్నది.