న్యూఢిల్లీ, మే 7: ఇప్పటికే దేశంలో మూడు దశలు పూర్తి చేసుకున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏడో, ఆఖరి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. జూన్ 1న జరిగే ఈ ఎన్నికల్లో 57 సీట్లకు పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గానికి ఈ విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు మే 14 ఆఖరి తేదీ.