Amit Shah @ Sri Nagar | వైద్యవిద్యను అభ్యసించాలంటే కశ్మీరీ యువత ఇక పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఇంతకుముందు 500 మంది యువకులు మాత్రమే వైద్యులయ్యేవారు. ఇప్పుడు నూతన మెడికల్ కాలేజీలు వచ్చాక రెండువేల మంది యువకులు వైద్యులు అవుతారన్నారు.
ఇంతకుముందు జమ్ముకశ్మీర్‌ను పాలించిన మూడు కుటుంబాలు మాత్రమే కశ్మీర్ లోయలో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాయన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఏడు నూతన మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్ధారించారన్నారు.
ఇప్పటివరకు కశ్మీర్‌ను పాలించిన మూడు పార్టీలే జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో వెనుకబడటానికి కారణం అని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీల పేరెత్తకుండానే విమర్శలు గుప్పించారు. అందుకు ఆ పార్టీలు కశ్మీరీ ప్రజలకు సమాధానం చెప్పాలని అమిత్‌షా డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
28 నుంచి ప్లిఫ్‌కార్ట్ బిగ్ దివాళి సేల్ : ఐఫోన్ 12, షియోమి ఫోన్లపై భారీ ఆఫర్లు!
EPFO Balance | పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..
Tax on Gratuity | గ్రాట్యుటీ మీద పన్ను ఉంటుందా?
Fuel Price Hike | 2020 మే నుంచి పెట్రోల్, డీజిల్ ధరలెలా పెరిగాయంటే!
పెట్రోల్, డీజిల్ ధరలపై ‘శతాబ్ది ఉత్సవాలు జరుపుకోండి’.. కేంద్రానికి చిదంబరం చురకలు