ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందుతున్నప్పుడు పెద్ద మొత్తంలో గ్రాట్యుటీ రూపంలో డబ్బు చేతికందుతుంది. అయితే ఈ మొత్తాన్ని కొన్ని షరతులతో ఆదాయం పన్ను (ఐటీ) నుంచి మినహాయిస్తారు. గ్రాట్యుటీ మొత్తాలను పన్ను పరిధిలోకి తీసుకురావడానికి ముందు ఉద్యోగులను ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులుగా విభజిస్తారు. రిటైర్మెంట్ సమయంలో వచ్చే గ్రాట్యుటీ మీద పన్ను నిబంధనలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వేర్వేరుగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులను గ్రాట్యుటీ చట్టం 1972 పరిధిలో వచ్చేవారు, రానివారుగా విభజించారు.