Supreme Court | న్యూఢిల్లీ: పోలింగ్ కేంద్రంలో గరిష్ట ఓటర్ల సంఖ్యను 1,200 నుంచి 1,500కు పెంచటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ ఒక్క ఓటరునూ మినహాయించరాదని సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈసీకి స్పష్టం చేసింది. శాస్త్రీయమైన డాటాను పరిగణనలోకి తీసుకోకుండా పోలింగ్ కేంద్రంలో గరిష్ట ఓటర్ల సంఖ్యను ఈసీ పెంచిందని ‘పిల్’ తప్పుబట్టింది. దీనిపై మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేస్తామని ఈసీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.