జగదల్పూర్, అక్టోబర్ 4: నక్సల్స్‌తో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరపబోమని, వారు లొంగిపోవాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. శనివారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదల్పూర్లో జరిగిన బస్తర్ దసరా లోకోత్సవ్, స్వదేశీ మేళాలో ఆయన ప్రసంగిస్తూ నక్సల్స్ తమ ఆయుధాలను వదిలిపెట్టి ప్రభుత్వం ప్రకటించిన ‘లాభదాయక లొంగుబాటు, పునరావాస విధానానికి’ అంగీకరించాలని తెలిపారు. నక్సలిజం అంతానికి వచ్చే ఏడాది మార్చి 31 డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు. ‘గిరిజన సోదర, సోదరీమణులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. వారి గ్రామాల్లోని యువత ఆయుధాలను పారేసి, హింసను విడిచిపెట్టేలా ఒప్పించాలి’ అని షా కోరారు.