కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోమారు స్పందించారు. ఇలాంటి హింసాత్మక ఘటనలను తాము ఏమాత్రం సహించబోమని ఆమె వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే బీజేపీ గెలిచిందో అక్కడే ఎక్కువగా హింస చెలరేగిందని చెప్పారు.
పాత వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి బీజేపీ తప్పుడు ఘటనలను ప్రచారం చేస్తున్నదని మమతాబెనర్జి అరోపించారు. ఏదేమైనా ఇలాంటి హింసాత్మక ఘటనలను నిలిపివేయాలని ఆమె అన్ని పార్టీల వారిని కోరారు. పశ్చిమబెంగాల్ ఐకమత్యానికి నిదర్శనమని, ఇకపై ఎవరు హింసకు పురికొల్పినా సహించబోనని హెచ్చరించారు.