Car Parking | మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఓ కొత్త ప్రతిపాదనను అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇకపై పార్కింగ్ స్థలం ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే (Car Parking) నిబంధనను అమల్లోకి తీసుకురాబోతోంది (new rule for buyers). ఈ విషయాన్ని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ (Pratap Sarnaik) తాజాగా ప్రకటించారు.
నగరంలోని పలు అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలు పార్కింగ్ స్థలం లేక తమ కార్లను రోడ్లపైనే పార్క్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దీనికారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందన్నారు. ట్రాఫిక్ కారణంగా ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై పడిగాపులుకాయాల్సి వస్తోందని, అంతేకాకుండా అంబులెన్స్, అగ్నిమాపక వంటి అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని చెప్పారు. వాహనాల రద్దీని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై కార్లు కొనుగోలు చేసేవాళ్లు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిబంధన త్వరలోనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
Also Read..
Dense Fog | ఉత్తర భారతంపై పొగమంచు తీవ్రత.. విమాన, రైలు సర్వీసులకు అంతరాయం
Warships | నేడు మూడు యుద్ధనౌకలను జాతికి అంకితమివ్వనున్న ప్రధాని మోదీ