ముంబై: భారత్‌పై ట్రంప్ సర్కారు తీరుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాల విభాగం కార్యదర్శి దమ్ము రవి ఘాటుగా స్పందించారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులపై 50 శాతం టారిఫ్‌లు విధించడంలో తర్కబద్ధత కానీ, హేతుబద్ధత కానీ లేదని స్పష్టం చేశారు.
ఇది ఏకపక్ష నిర్ణయమన్నారు. ట్రంప్ ఇటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతాయని చెప్పారు. ఇది మనం అధిగమించవలసిన ఓ దశ అని వ్యాఖ్యానించారు. పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాల్లో కాల క్రమంలో పరిష్కారాలు లభిస్తాయనే ఆశాభావం వ్యక్తం.