Dharavi | ముంబైలో ధారావి స్లమ్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టు అమలులో పీటముడి పడిందా..? ధారావి స్లమ్ భూమిని అదానీ గ్రూప్‌కు అప్పగించడం లేదా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా ఉన్న ధారావి స్లమ్‌ను రీ డెవలప్ చేసేందుకు ఆహ్వానించిన ఇంటర్నేషనల్ బిడ్లలో పోటీ పడి అదానీ గ్రూపు గెలుచుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అదానీ గ్రూప్.. ధారావి స్లమ్ నివాసులకు అక్కడే ఇండ్లు నిర్మించి, తిరిగి వారికే కేటాయించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే ధారావి రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కింద ఈ భూమిని అదానీ గ్రూపునకు కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వశాఖలకు అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ భూమిపై ఆక్రమణలు జరుగుతున్నాయని వచ్చిన ఆరోపణలను ఎంపీ వర్ష గైక్వాడ్ తోసిపుచ్చారు. టెండర్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయం మేరకు డీఆర్పీ లేదా ఎస్ఆర్ఏ ధరలకు అనుగుణంగా మనీ చెల్లించే ధారావి రీ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు స్థలం అప్పగిస్తారని సమాచారం. కానీ, ఈ భూమిని మహారాష్ట్ర ప్రభుత్వం తమ సొంత సంస్థకే అప్పగిస్తారని కూడా వినిపిస్తున్నది.