న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో పోలీసుల వల్ల రైతులెవరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో కాంగ్రెస్ నేత ధీరజ్ ప్రసాద్ సాహు, ఆప్ నేత సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాతపూర్వక సమాధానమిచ్చారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. మద్దతు ధరపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.