న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ‘నో డ్యూ సర్టిఫికెట్ల’ను వారు దరఖాస్తు చేసినప్పటి నుంచి 48 గంటల్లోగా జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశించింది. నామినేషన్ పత్రాలతోపాటు నో డ్యూ సర్టిఫికెట్ను సమర్పించకపోతే, అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించే అవకాశం ఉన్నందు వల్ల ఈ ఆదేశాలను జారీ చేసింది.
నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తయిన తర్వాత ఈ సర్టిఫికెట్ను సమర్పించినప్పటికీ ప్రయోజనం ఉండదని గుర్తు చేసింది. అభ్యర్థి పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవడం వల్ల ఆ అభ్యర్థికి మాత్రమే కాకుండా, రాజకీయ పార్టీలకు, ఓటర్లకు కూడా నష్టం జరుగుతుందని తెలిపింది.