70 ఏండ్లలో అమేథీలో దవాఖానా కూడా లేదే?!
70 ఏండ్లలో అమేథీలో జిల్లా దవాఖానా | కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ....

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లు దాటినా అమేథిలో ఒక జిల్లా కేంద్ర దవాఖాన కూడా ఏర్పాటు చేయలేదని మంగళవారం ఎద్దేవా చేశారు. ఆత్మ నిర్బర్ పథకం కింద రూ.6 లక్షల కోట్ల నిధుల సేకరణకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ను రాహుల్ గాంధీ తప్పుబట్టారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ, కేరళలోని వయనాడ్ స్థానాల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అమేథిలో రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓడించారు.
అమేథీలో 70 ఏండ్లలో ఒక్క జిల్లా కేంద్ర దవాఖాన ఏర్పాటు చేయని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.6 లక్షల కోట్ల నిధులు సేకరించడం సమస్యగా ఉందని ఇరానీ వ్యాఖ్యానించారు. నేషనల్ మానిటైజేషన్ పాలసీ కింద 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, స్టేడియంలు, నౌకాశ్రయాలు, పవర్, గ్యాస్ తదితర రంగాల సంస్థల్లో వాటాలను ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

