న్యూఢిల్లీ : ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ర్టాలకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం తెలిపింది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ సమాధానం ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు తమ దృష్టిలో ఉందని మంత్రి చెప్పారు. అయితే, ఈ తీర్పు అమలుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. సామాజికంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు కల్పించేందుకు షెడ్యూల్డ్ కులాల్లో ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ర్టాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.