పట్నా, నవంబర్ 1:బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపించింది.ఈ క్రమంలో రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్ ప్రజలను ఉద్దేశిస్తూ, ఓ వీడియో విడుదల చేశారు. గత రెండు దశాబ్దాలుగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, 20 ఏండ్లుగా తాను ప్రజల కోసమే పని చేశానని చెప్పుకున్నారు. గతంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా దారుణంగా ఉండేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట వాటిని మెరుగుపరిచినట్టు తెలిపారు.