న్యూఢిల్లీ: ఇండియా కూటమి పాత మిత్రపక్షాలు జేడీయూ, టీడీపీతో చర్చలపై బుధవారం నిర్ణయం తీసుకొంటామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయనను కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించగా, ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో సమావేశం అవుతామని, చర్చల్లో తీసుకొనే నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్తామని వెల్లడించారు. వయనాడ్, రాయ్‌బరేలీలలో ఏ స్థానాన్ని వదులుకోవాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.