Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) కుమారుడు నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి (Bihar Politics) వస్తున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. నితీశ్ నాయకత్వం తర్వాత పార్టీకి వారసుడు ఎవరు? అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుండగా.. నితీశ్‌కు వారసునిగా అతని కుమారుడిని రంగంలోకి దింపాలని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారం వేళ నిశాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై జేడీయూ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం నితీశ్‌కు అత్యంత సన్నిహితుడు సంజయ్ కుమార్ ఝా కీలక వ్యాఖ్యలు చేశారు. నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. ఆయన పార్టీలో ఎప్పుడు చేరాలని నిర్ణయించుకోవడం ఆయన ఇష్టం అని వ్యాఖ్యానించారు. నిశాంత్ రాజకీయ అరంగేట్రం ఊహాగానాల వేళ సంజయ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
IndiGo | సుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం.. విమానాల రద్దుపై పిటిషన్ దాఖలు
Indian Railways | ఇండిగో సంక్షోభం వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం
IndiGo | వరుసగా ఐదో రోజూ అదేసీన్.. నేడు 500 విమానాలు రద్దు.. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల రద్దీ